కర్నూలు: మద్యం విక్రయాల్లో కొత్త రూల్.. ఇకపై ఈ-పోస్ తప్పనిసరి!
కర్నూలు జిల్లాలో మద్యం విక్రయాల్లో పారదర్శకత కోసం ఈ-పోస్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మద్యం షాపుల లైసెన్సీలకు, అధికారులకు సాఫ్ట్వేర్ వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రతి విక్రయాన్ని డిజిటల్ విధానంలోనే నమోదు చేయాలని డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి సూచించారు.