కర్నూలు ప్రభుత్వ R&B కార్యాలయంలో డ్యూటీ సమయాల్లోనే మద్యం సేవిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీనియర్ అసిస్టెంట్ తన చాంబర్లో మద్యం ఉంచుకొని సేవిస్తున్నట్లు వీడియోలో కనిపించడంతో ప్రజా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. జిల్లా కేంద్రంలో ఇంత పెద్ద శాఖలో ఇలాంటి ఘటనలు జరగడం పై “అధికారులు ఏమి చూస్తున్నారు?” అంటూ ప్రశ్నిస్తున్నారు. పోలీస్ అధికారి ఉండడం గమనార్ధం..సంబంధిత ఉద్యోగిపై జిల్లా అధికారులు తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి అని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.