దర్శి: మారెళ్లలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం
ముండ్లమూరు మండలం మారెళ్లలో గురువారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. బలమైన గాలులు వీచడంతో విద్యుత్ అధికారులు అప్రమత్తమై సరఫరా నిలిపివేశారు. అకాల వర్షంతో ప్రజలకు ఉక్కపోత నుంచి ఉపశమనం లభించిందని, మరోపక్క అకాల వర్షానికి పంట పొలాల్లో ఆరబోసిన మిర్చి, పలు రకాల పంటలు తడిచిపోయాయి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.