ఒంగోలు అర్బన్: తౌషిక్ కుటుంబానికి న్యాయం చేసేలా చూస్తామని హామీ ఇచ్చిన సింగరాయకొండ సర్కిల్ సిఐ శ్రీహరి, కన్నీరు పెట్టుకున్న బాధితుడు
Ongole Urban, Prakasam | Sep 13, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని శ్రీ చైతన్య నవోదయ కోచింగ్ సెంటర్ లో ఏడు నెలల క్రితం తౌషిక్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మృతిని జీర్ణించుకోలేక తల్లి మౌలాభి రెండు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయంపై సీఐ శ్రీహరి విచారణ చేపట్టారు. కుమారుడి మృతిపై ఏడు నెలలుగా పోరాటం చేస్తున్న న్యాయం జరగలేదని కన్నీరు పెట్టుకుంటూ విద్యార్థి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. అలానే భార్యను కూడా పోగొట్టుకున్నానని ఇచ్చాన జరిపి న్యాయం చేయాలని సిఐకి బాధితులు విజ్ఞప్తి చేశాడు.