శ్రీశైలం: గెలిచిన డిక్లరేషన్ ఫారం ఇవ్వడం లేదని ఆత్మకూరు పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థుల ఆందోళన
ఆత్మకూరు పోలింగ్ కేంద్రంలో వైసీపీ అభ్యర్థులు, ఏజెంట్లు ఆత్మకూరు పోలింగ్ కేంద్రం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఏజెంట్లు ఆందోళనకు దిగారు. పాములపాడు మండలంలోని రుద్రవరం, మద్దూరు గ్రామాలతో పాటు కొత్తపల్లి మండలంలోని దుద్యాల, ఎర్రమఠం గ్రామాలకు చెందిన వైసీపీ అభ్యర్థులు విజయం సాధించినప్పటికీ, వారికి గెలుపు ధ్రువీకరణ పత్రాలు (డిక్లరేషన్ ఫారాలు) అందజేయకుండా అధికారులు నిలుపుదల చేస్తున్నారని వైసీపీ నాయకులు ఆరోపించారు. పాములపాడు మండలంలో రెండు, కొత్తపల్లి మండలంలో రెండు స్థానాలకు సంబంధించి వైసీపీ అభ్యర్థులు గెలిచినప్పటికీ డిక్లరేషన్ ఫారాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.