నంద్యాల అర్బన్: 3000 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ : కలెక్టర్ రాజకుమారి
Nandyal Urban, Nandyal | Sep 12, 2026
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే ఉద్దేశంతో AP కాలుష్య నియంత్రణ మండలి, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఉచితంగా 3 వేల మట్టి గణేశ్ విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కలెక్టర్ కార్యాలయం వద్ద పంపిణీ చేస్తామన్నారు. పర్యావరణానికి హాని కలిగించని సహజ మట్టితో తయారు చేసిన గణేశ్ విగ్రహాలను ఉపయోగించాలని కలెక్టర్ సూచించారు