కనిగిరి: పామూరు పట్టణంలో హైవే రోడ్లపై వాకింగ్ చేసి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు: పామూరు సిఐ భీమా నాయ
పామూరు పట్టణంలో వాకింగ్ చేసేవారికి సీఐ బీమా నాయక్ శనివారం పలు సూచనలు చేశారు. పామూరు సర్కిల్ కార్యాలయంలో సీఐ మాట్లాడుతూ.. హైవేపై వాకింగ్ చేస్తూ ఈమధ్య పలువురు ప్రమాదాలకు గురికావడం జరిగిందని అన్నారు. మహిళలు, పురుషులు పామూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో(వెనుక వైపు) ప్రశాంతంగా వాకింగ్ చేసుకోవచ్చని సూచించారు. పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని సీఐ కోరారు.