కనిగిరి: కొత్తూరు సమీపంలో బైక్ అదుపుతప్పి కిందపడ్డ భార్య భర్తలు, భార్య అక్కడికక్కడే మృతి, భర్తకు తీవ్ర గాయాలు
కనిగిరి: బైక్ అదుపుతప్పి కింద పడిపోవడంతో భార్య అక్కడికక్కడే మృతి చెందగా, భర్తకు తీవ్ర గాయాలైన సంఘటన కనిగిరి పట్టణంలోని కొత్తూరు సమీపంలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పామూరు వైపు నుండి కనిగిరి కి కొత్తూరుకు చెందిన భార్య భర్తలు బైక్ పై వస్తున్నారు. ఒకసారిగా రోడ్డుపై పందుల గుంపు అడ్డు రావడంతో, వాటిని తప్పించబోయి బైక్ అదుపుతప్పడంతో ఇద్దరు రోడ్డుపై పడ్డారు. ఈ ప్రమాదంలో భార్య వెంకట లక్ష్మమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, భర్త చెంచారెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. చెంచిరెడ్డిని మెరుగైన చికిత్స కోసం బంధువులు ఒంగోలుకు తరలించారు