నాగర్ కర్నూల్: వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్, భారీగా బంగారం రికవరీ
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం శాయినిపల్లి, మమ్మాయిపల్లి గ్రామాల్లో వరుస చోరీలకు పాల్పడిన కసరి శివకుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి 25 తులాల బంగారం, 182 తులాల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు సీఐ అశోక్ రెడ్డి తెలిపారు.