కనిగిరి: రైతులు సేంద్రియ వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి: కనిగిరి వ్యవసాయ శాఖ ఏడిఏ వెంకటరమణ
కనిగిరి పట్టణంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద సేంద్రీయ వ్యవసాయం ద్వారా రైతులు పండించిన ఆకుకూరలు, కూరగాయల విక్రయాలను కనిగిరి వ్యవసాయ శాఖ ఏడిఏ వెంకటరమణ సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రైతులంతా సేంద్రీయ వ్యవసాయం వైపు మొగ్గుచూపులు అన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయలు తింటే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి జైనులాబ్దిన్, వ్యవసాయ శాఖ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.