కనిగిరి: పామూరు పట్టణంలో అధ్వాన్నంగా పారిశుధ్యం, సమస్యల పరిష్కారంలో అధికారులు విఫలమయ్యారన్న ఏఐటియుసి అధ్యక్షులు మస్తాన్ రావు
పామూరు పట్టణంలో పారిశుధ్యం అధ్వానంగా తయారైందని ఫలితంగా దోమల వ్యాప్తి ఎక్కువై ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కనిగిరి నియోజకవర్గ ఏఐటీయూసీ అధ్యక్షులు మస్తాన్ రావు మంగళవారం ఆరోపించారు. డ్రైనేజీ కాలువల్లో కనీసం బ్లీచింగ్ కూడా చల్లే స్థితిలో పంచాయతీ అధికారులు లేరన్నారు. చెత్త సేకరణ కోసం డ్రమ్ములు కూడా ఏర్పాటు చేయడం లేదని, పంచాయతీ పాలకుల నిర్లక్ష్యం మూలంగా ప్రజలకు వ్యాధులు ప్రబలుతున్నాయని విమర్శించారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు స్పందించి, దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు చెత్త సేకరణ కోసం డ్రమ్ములు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.