కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ సమావేశంలో ఉద్రిక్తత: అధికారుల తీరుపై కౌన్సిలర్ల నిరసన
కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో కౌన్సిలర్లు నిరసనకు దిగారు. డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి సమస్యలను పరిష్కరించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ బీజేపీ కౌన్సిలర్లు పోడియం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.