కోడుమూరు: ప్యాలకుర్తి వద్ద లభించిన మృతదేహం కేసు చేధించిన పోలీసులు, హత్యగా తేలిన వైనం, ముగ్గురు అరెస్టు
కోడుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్యాలకుర్తి వద్ద అక్టోబర్ 30న గుర్తించిన మృతదేహం కేసును పోలీసులు చేదించారు. మృతుడు దస్తగిరి ఆచారి హత్యకు గురైనట్లు తేల్చారు. శనివారం సాయంత్రం కేసు వివరాలను సీఐ తబ్రేజ్ వెల్లడించారు. దస్తగిరి ఆచారిని అతడు భార్య వెంకటేశ్వరమ్మ అలియాస్ వరలక్ష్మి బామ్మర్దులు శేఖర్, వీరేశులు మద్యం తాగించి హత్య చేశారని, హత్యకు గల కారణాలు వెల్లడించారు. నిందితులను అరెస్టు చేసి, రిమాండ్ తరలించినట్లు తెలిపారు.