కనిగిరి: వెలిగండ్ల మండలంలో 5 ఏండ్ల మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ నిందితుడికి 10 ఏళ్లు జైలు శిక్ష విధించిన కోర్టు
వెలిగండ్ల మండలంలో 5 ఏండ్ల మైనర్ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ నిందితుడికి ఒంగోలు పోక్సో కోర్టు మంగళవారం పది సంవత్సరాల జైలు శిక్ష, రూ.5 వేలు జరిమానా విధించింది. ఈ కేసులో బాధితురాలికి రూ.75 వేలు పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసు విషయంలో ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు స్పందిస్తూ... పోలీసుల సమర్థవంతమైన దర్యాప్తుతో నేరం నిరూపితమై నిందితుడికి శిక్ష పడిందని అన్నారు. మహిళలు మరియు చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడే వారిని చట్టం ఎట్టి పరిస్థితుల్లో విడిచి పెట్టదని ఎస్పీ హెచ్చరించారు.