నవీపేట్: నవీపేట శివాజీ చౌక్ వద్ద ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ - పలువురికి తీవ్ర గాయాలు
నవీపేట మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద బుధవారం ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో పల్టీ కొట్టడంతో ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.