ఒంగోలు అర్బన్: సింగరాయకొండ లోని ప్రైవేట్ నవోదయ పాఠశాలలో విద్యార్థి ఆత్మహత్య, న్యాయపోరాటం చేస్తూ తల్లి మృతి
Ongole Urban, Prakasam | Sep 12, 2026
ప్రకాశం జిల్లా సింగరాయకొండ లోని ఓ ప్రైవేటు నవోదయ పాఠశాలలో ఏడు నెలల క్రితం ఆరవ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తమ కుమారుడిని పాఠశాల యాజమాన్యం హత్య చేసిందని ఆరోపిస్తూ విద్యార్థులు తల్లి మౌలాభి రెండు రోజుల క్రితం విష ద్రవం తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై మౌలాభి బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. అధికారులకు ఫిర్యాదు చేసిన నిర్లక్ష్యంగా వ్యవహరించారని నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని మౌలాభి కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.