రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరం: టీడీపీ అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేసిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో 30 మంది టీడీపీ అభ్యర్థులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ బీ-ఫారాలు అందజేశారు. కూటమి గెలుపు కోసం కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. 42 డివిజన్లలో సామాజిక న్యాయం పాటిస్తూ వివిధ వర్గాలకు సీట్ల కేటాయింపు జరిగింది.