కొండపి: కొండేపి నియోజకవర్గంలో తాగునీటి సమస్య రాకుండా చూడాలని అధికారులను ఆదేశించిన మంత్రి స్వామి
కొండపి నియోజకవర్గంలోని ఆరు మండలాల తహసిల్దార్లు మరియు ఎంపీడీవోలతో మంత్రి స్వామి టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెం గ్రామంలోని మంత్రి క్యాంపు కార్యాలయం నందు మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొండేపి నియోజకవర్గంలో వేసవిలో ప్రజలకు తాగు నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని వారికి సూచించారు. కూటమి ప్రభుత్వం ఏడాదిలోనే పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిందని మంత్రి పేర్కొన్నారు.