కొండపి: పొన్నలూరులో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం.. పలుచోట్ల విరిగిన పడిన చెట్లు
పొన్నలూరులో ఆదివారం మధ్యాహ్నం ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. దీంతో పొలాలలో, ఆరు బయట ఆరబోసిన మిరపకాయలు, నువ్వుల పంట తడిసిపోయాయి. అలాగే పొగాకు బ్యారెన్ల చెక్కులు తడిచిపోయాయి. ఒకపక్క ఎండ కాస్తూనే వర్షం పడటంతో విచిత్రమైన వాతావరణం నెలకొంది. అలాగే ఈదురుగాలులకు అక్కడక్కడ చెట్లు నేలకొరిగాయి.