ఉరవకొండ: బెళుగుప్ప పదవ తరగతి పరీక్ష కేంద్రాల్లో తొమ్మిది మంది విద్యార్థులు గైర్హాజరు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలో పదవ తరగతి పరీక్ష నిర్వహణకు ఏర్పాటు చేసిన రెండు పరీక్షా కేంద్రాల్లో కలిపి 9 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఎంఈఓ -1,2లు గోవిందరాజులు హరికృష్ణ లు సోమవారం పేర్కొన్నారు. మండల కేంద్రంలోని శ్రీనివాస విద్యానికేతన్ మరియు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పరీక్ష కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ఆయా పరీక్ష కేంద్రాల్లో 438 విద్యార్థులకు గాను 429 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు అన్నారు. పరీక్ష కేంద్రాలను ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు నరసింహారెడ్డి గోపీనాథ్ మాధవ అధికారులు తనిఖీ చేశారు.