శ్రీశైలం: ఆత్మకూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో మెటీరియల్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే బుడ్డా
ఆత్మకూరు పట్టణంలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో నిర్వహించిన మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వసతి గృహంలోని విద్యార్థినీలకు ట్రంక్ పెట్టెలు, షూస్, దుప్పట్లు, ప్లేట్లను MLA బుడ్డా రాజశేఖర్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం వసతి గృహాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, హాస్టల్ కెపాసిటీకి మించి దాదాపు రెట్టింపు సంఖ్యలో విద్యార్థినీలు ఉన్నారని, అందుకు అనుగుణంగా త్వరలోనే వసతి గృహాన్ని ఆధునీకరించి మరిన్ని సౌకర్యాలుకల్పిస్తామని్నారు. విద్యార్థినీలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు తన సొంతనిధులుతో ఏర్పాటు చేస్తామన్నారు.