రాజమండ్రి సిటీ: రాజమహేంద్రవరంలో వాయు కాలుష్య నియంత్రణకు కలెక్టర్ కీలక ఆదేశాలు
రాజమహేంద్రవరంలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి సమగ్ర ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. కాలుష్య హాట్స్పాట్లపై నిఘా, ఈ-వాహనాల ప్రోత్సాహం, పంట అవశేషాల దహనం తగ్గించడం వంటి అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు.