కొండపి: కొండపి జనసేన పార్టీ కార్యాలయంలో కార్యకర్తలతో సమావేశమైన ఇంఛార్జ్ మనోజ్ కుమార్, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచన
ప్రకాశం జిల్లా కొండపి జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం స్థానిక జనసేన పార్టీ ఇన్ ఛార్జ్ మనోజ్ కుమార్ కార్యకర్తలతో సమావేశమయ్యారు. స్థానిక సమస్యలను కనిపెట్టి ఎప్పటికప్పుడు తన దృష్టికి తీసుకురావాలని మనోజ్ కుమార్ కార్యకర్తలకు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికై జనసేన పార్టీ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. అలానే సభ్యత నమోదుక పత్రాలు అందిస్తూ ప్రమాద బీమా 5 లక్షల రూపాయల వరకు పొందుతారని కార్యకర్తలకు తెలిపారు. పార్టీ బలోపేతానికి అందరు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.