కొండపి: కొండపి పొగాకు వేలం కేంద్రంలో 342 పొగాకు బేళ్లు తిరస్కరణ: వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్
కొండపి పొగాకు వేలం కేంద్రంలో బుధవారం జరిగిన వేలంలో అధికంగా 342 బేళ్లను కొనుగోలుదారులు తిరస్కరించారని వేలం నిర్వహణ అధికారి సునీల్ కుమార్ తెలిపారు . ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ..వివిధ గ్రామాల రైతులు 1,227 బేళ్లు తీసుకురాగా, కేవలం 885 బేళ్లు మాత్రమే కొనుగోలు చేశారు. అధిక శాతం బేళ్లు తిరస్కరణకు గురికావడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేలం కేంద్రం అధికారి జోక్యం చేసుకుని కొనుగోలు ప్రక్రియ సక్రమంగా జరిగేలా చూడాలని రైతులు కోరుతున్నారు.