యాదగిరిగుట్ట: యాదగిరిగుట్టలో బీర్ల ఐలయ్య ఇంట్లో వ్యక్తి ఆత్మహత్య, తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్న పోలీసులు
యాదగిరిగుట్టలో ప్రభుత్వం ఆలేరు ఎమ్మెల్యే బిళ్ళ ఐలయ్య ఇంట్లో వృత్తి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎస్సై భాస్కర్ మాట్లాడుతూ మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలం కూడా నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఘటనపై యాదగిరిగుట్ట పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందని తెలిపారు .ఈ విషయమే ఎవరైనా నిరాధారమైన ఆరోపణలు సోషల్ మీడియా ద్వారా గాని మరి ఏ విధంగానైనా ప్రచారం చేస్తే ఆ వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.