శ్రీశైలం: ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ప్రశాంతంగా ముగిసిన MPTC ZPTC కౌంటింగ్ ప్రక్రియ
ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలో ఎంపీటీసీ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ శనివారం సాయంత్రం ప్రశాంతంగా ముగిసింది. జడ్పిటిసి లకు సంబంధించిన కౌంటింగ్ సాయంత్రం ఐదు తర్వాత కూడా కొనసాగుతూనే ఉంది.ఆత్మకూరు సబ్ డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, కొత్తపల్లి, పాములపాడు మండలాలకి చెందిన ఎంపీటీసీ జెడ్పిటిసిల కౌంటింగ్ ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు నిర్వహించారు.