పెద్దాపురం: పెద్దాపురం కళాకారుడి అద్భుతం: కేవలం 1 సెంటీమీటర్ ఎత్తులో వినాయక విగ్రహం
కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన సూక్ష్మ కళాకారుడు తాళాబత్తుల సాయి, కేవలం 1 సెంటీమీటర్ ఎత్తులో వినాయక విగ్రహాన్ని రూపొందించారు. చెక్క, బంగారం, స్టీలుతో 8 రోజుల పాటు శ్రమించి ఈ కళాఖండాన్ని తయారు చేసినట్లు ఆయన తెలిపారు.