మునగాల: రేపాల గ్రామంలో ఘనంగా త్రిమూర్తి అమ్మవార్ల బండ్ల పండుగ
సూర్యాపేట జిల్లా మునగాల మండలం రేపాల గ్రామంలో త్రిమూర్తి అమ్మవార్ల గ్రామ పండుగ భక్తిశ్రద్ధలతో జరిగింది. ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు, అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామమంతా సందడిగా మారిన ఈ వేడుకలో గ్రామ పెద్దలు ఏర్పాట్లను పర్యవేక్షించారు.