శ్రీశైలం: శ్రీశైలంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు. ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించిన ఈవో శ్రీనివాసరావ
శ్రీశైలంలో అక్టోబర్ 11వ తేదీ నుంచి 20 వ తేది వరకు దసరా మహోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ దసరా మహోత్సవాల సందర్భంగా ఈవో శ్రీనివాసరావు అధికారులు అర్చకులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈవో మాట్లాడుతూ.. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. ఉత్సవాలలో వాహన సేవలు, అమ్మవారికి నవదుర్గా అలంకరణలు, శమీపూజ, పుష్కరిణిలో తెప్పోత్సవం కార్యక్రమాలు ఉంటాయన్నారు.