శ్రీశైలం: ఆత్మకూరు సబ్‌డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, వెలుగోడు, పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్
ఆత్మకూరు సబ్‌డివిజన్ పరిధిలోని ఆత్మకూరు, వెలుగోడు, పాములపాడు, కొత్తపల్లి మండలాల్లో అర్థరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గత ఐదు రోజులుగా తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.మరోవైపు వర్షాలు లేక ఎండిపోతూ కొన ఊపిరితో ఉన్న పంటలకు ఈ వర్షం జీవం పోసింది. వర్షం కోసం ఎదురుచూస్తున్న రైతులకు వర్షం కురవడంతో ఊరట లభించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ప్రజలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆత్మకూరు సబ్‌డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వర్షం కొనసాగుతుండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.