సిద్దిపేట అర్బన్: ఈ నెల 10న 'చలో హైదరాబాద్': సిద్ధిపేట పెన్షనర్స్ జేఏసీ పిలుపు
పెన్షనర్లు, ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 10న జరగనున్న 'చలో హైదరాబాద్' కార్యక్రమానికి సిద్ధిపేట జిల్లా పెన్షనర్స్ జేఏసీ పిలుపునిచ్చింది. పెండింగ్లో ఉన్న 6 డీఏలు, పీఆర్సీ ప్రకటన, హెల్త్ కార్డుల అమలుపై వారు డిమాండ్ చేశారు.