ఉరవకొండ: వజ్రకరూరు గ్రామ పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసరకుల పంపిణీ
అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండల కేంద్రంలోని గ్రంథాలయ అధికారి శ్రీనివాసులు వజ్రకరూరు గ్రామంలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పండుగ సంతోషంగా జరుపుకోవాలని గ్రామ సచివాలయ ఆవరణ వద్ద సోమవారం నిత్యవసర సరుకులను వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మోనాలిసా,పంచాయతీ కార్యదర్శి మల్లయ్య,అంబేద్కర్ అవార్డు గ్రహీత సామాజిక వేత్త బెంజిమెన్,ఎమ్మార్పీఎస్ నాయకులు సుకుమార్,సచివాలయ సిబ్బంది,పారిశుద్ధ్యం కార్మికులు తదితరులు పాల్గొన్నారు.