శ్రీశైలం: ఎర్రగుడూరు గ్రామ పంట పొలాల్లో కుక్కల దాడిలో మృతి చెందిన అడవి దుప్పి
ఎర్రగుడురు గ్రామ శివారులో నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని అనుకొని ఉన్న పంట పొలాల్లో అడవి దుప్పి మృతి చెందింది. నీళ్ల కోసం పంట పొలాల్లోకి వచ్చిన అడవి దుప్పిని కుక్కలు వెంటపడి కొరికి చంపాయి. వెంటనే అటవీశాఖ అధికారులకు రైతులు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న అటవీ సిబ్బంది పంచనామ నిర్వహించి దుప్పి మృతదేహాన్ని ఖననం చేశారు. నీళ్ల కోసం అడవిదుప్పులు తరచు గ్రామాల వైపు వచ్చి ప్రమాదాల బారిన పడుతున్నాయని గ్రామస్తులు తెలియజేశారు.