రాప్తాడు: రాప్తాడు మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయంలో పి ఫోర్ కార్యక్రమంలో పాల్గొన్న రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు మండల కేంద్రంలో మంగళవారం నాలుగు గంటల 15 నిమిషాల సమయంలో రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో పి ఫోర్ కార్యక్రమంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు పి ఫోర్ కార్యక్రమం నిర్వహించి పేద కుటుంబాల్లో విద్యార్థిని సదువుకు సహకారం కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం వ్యవసాయంలో సహకారం చేయడం ఈ విధంగా పేదల జీవితాన్ని మార్చేందుకు పి ఫోర్ ఎంతగానో ఉపయోగపడుతుందని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.