కొండపి: సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం సముద్రతీరం కోతకు గురై 50M మేర ముందుకు వచ్చిన సముద్రం
సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం సముద్రతీరం కోతకు గురై శనివారం 50M మేర సముద్రం ముందుకు వచ్చింది. గత రెండు నెలల నుంచి సముద్రతీరం కోతకు గురవుతూనే ఉందని స్థానికులు తెలిపారు. సముద్రంలో ఆటుపోట్ల కారణంగా జిల్లా వ్యాప్తంగా కొన్ని ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయని కావున ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.