దర్శి: దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో ఘనంగా బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాలు
దర్శి మండలం బొట్లపాలెం గ్రామంలో బ్రహ్మంగారి ఆరాధన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆరాధన మహోత్సవంలో భాగంగా నాలుగు విద్యుత్ ప్రభలను ఏర్పాటు చేసి ప్రభలపై సాంస్కృతి కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. బుధవారం రాత్రి ప్రభలపై ఆయా పార్టీ నేతలు ప్రోత్సహించే విధంగా ప్రసంగించారు. టిడిపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ప్రభ పై నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శి నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ఉంచుతామని తెలిపారు ,వైసీపీ పార్టీ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన ప్రభపై డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జనసేన ప్రభుత్వపై బాలినేని ప్రణీత్ రెడ్డి ప్రసంగించారు.