దర్శి: ముండ్లమూరు మండలం మారేళ్ళలో సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన పోలీసులు
ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామంలో పోలీసులు గ్రామస్తులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. గురువారం మారెళ్ళ గ్రామానికి ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో సిబ్బంది వెళ్లి గ్రామస్తులను సమావేశపరిచి సైబర్ నేరాల పట్ల అప్రమత్తతపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్సై కమలాకర్ మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తుల నుండి వచ్చేటువంటి యాప్ లింకులను ఎవరు కూడా ఓపెన్ చేయవద్దన్నారు వాట్సాప్ మరియు ఇతర గ్రూపులలో వచ్చాయి అన్నోన్ మెసేజ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు కొత్తరకం సైబర్ నేరాలు పై అవగాహన కల్పించారు.