దర్శి: పాకిస్తాన్లోని ఉగ్రవాదులపై దాడి నేపథ్యంలో దర్శి పట్టణంలో తహసిల్దార్ ఆధ్వర్యంలో సంబరాలు
ప్రహల్లామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో భారత సైన్యం పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ కార్యక్రమంలో భాగంగా యుద్ధం చేసి 100 మంది ఉగ్రవాదులను మట్టు పెట్టిన నేపథ్యంలో దర్శి పట్టణంలో దర్శి తాసిల్దార్ శ్రావణ్ కుమార్ ఎస్సై మురళి కమిషనర్ మహేశ్వర రావు ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ను కట్ చేసి భారత సైన్యానికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ..అమాయకపు ప్రజలను ఉగ్రవాదులు చంపడం యావత్ భారతదేశం జీర్ణించుకోవట్లేదని, ఉగ్రవాదులను హతమార్చడం ద్వారా ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారని తెలిపారు.