నాగర్ కర్నూల్: నాగర్కర్నూల్లో బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్
నాగర్కర్నూల్ పట్టణంలోని 18వ వార్డు, 3వ వార్డు బస్తీ దవాఖానాలను జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ గురువారం తనిఖీ చేశారు. వైద్య సేవలు, మందుల లభ్యత మరియు రోగులకు అందుతున్న చికిత్సపై ఆరా తీసి, నాణ్యమైన సేవలు అందించాలని సిబ్బందిని ఆదేశించారు.