తాడిపత్రి: చాగల్లులో అత్యంత వైభవంగా భక్తిశ్రద్ధలతో చౌడేశ్వరి దేవి జ్యోతుల మహోత్సవం
పెద్దపప్పూరు మండలం చాగల్లు గ్రామంలో మంగళవారం తొగట వీర క్షత్రియ సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు చింతా పురుషోత్తం ఆధ్వర్యంలో చౌడేశ్వరి దేవి భక్తులు జ్యోతుల మహోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో అత్యంత ఘనంగా నిర్వహించారు. జ్యోతులను తలపై పెట్టుకుని గ్రామములోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా తోగట వీర క్షత్రియులు తలపై జ్యోతులను పెట్టుకొని అద్భుతంగా నృత్యం చేశారు. అనంతరం జ్యోతిలను చౌడేశ్వరి దేవి ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు చేశారు.