వికారాబాద్: వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్‌పల్లి గ్రామ శివారులో ఆటో, ట్రాక్టర్ ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు
వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని గిరిగేట్‌పల్లి గ్రామ శివారులో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతగిరిపల్లి వెళ్లే రోడ్డు మార్గంలో ఎదురుగా వస్తున్న ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడంతో అందులో ప్రయాణికులు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.