కనిగిరి: పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు: కనిగిరి మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్
కనిగిరి పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. కనిగిరి పట్టణంలోని ఎనిమిదవ వార్డులో ట్యాంకర్ల ద్వారా జరుగుతున్న మంచినీటి సరఫరాను మున్సిపల్ చైర్మన్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.... కనిగిరి పట్టణంలోని 20 వార్డుల్లో ఎక్కడ నీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. ఎక్కడైనా నీటి సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.