కర్నూలు: వెంకన్న బావిని పర్యాటక ప్రాంతంగా మారుస్తాం: మున్సిపల్ ఛైర్మన్ స్వప్న
చారిత్రాత్మక వెంకన్న బావిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ ఛైర్మన్ స్వప్న తెలిపారు. బావి నీటిని శుద్ధి చేసి వాడకంలోకి తీసుకురావడంతో పాటు, బావిలో చెత్త వేయకుండా చర్యలు తీసుకుంటామని, ప్రజలు సేదతీరేలా అహ్లాదకరమైన వాతావరణం కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు.