కనిగిరి: విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని కోరుతూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కనిగిరి పట్టణంలో నిరసన ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రైతు సంఘం జిల్లా కార్యదర్శి జిపి రామారావు మాట్లాడుతూ ... పెంచిన విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని, విద్యుత్ వినియోగదారులకు స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేయడాన్ని విరమించుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదానీతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలన్నారు. సిపిఐ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు