కనిగిరి: పట్టణంలోని టిడిపి కార్యాలయంలో టిడిపి సంస్థ గత ఎన్నికలపై నాయకులతో సమీక్ష నిర్వహించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలోని టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహ రెడ్డి టీడీపీ సంస్థగత ఎన్నికల ప్రక్రియపై నియోజకవర్గంలోని 6 మండలాల టిడిపి నాయకులు, ముఖ్య నేతలతో శుక్రవారం రాత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... సంస్థ గత ఎన్నికల ప్రక్రియలో భాగంగా గ్రామ, మండల, నియోజకవర్గ స్థాయి వరకు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు పదవులు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ పదవుల కోసం ఎటువంటి సిఫార్సులను అంగీకరించమన్నారు. కష్టపడే వారికి పదవులు వస్తాయన్నారు.