కనిగిరి: గుదేవారి పాలెం వద్ద రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు, కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలింపు
పెదచెర్లోపల్లి: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన పెద చెర్లోపల్లి మండలంలోని గుదేవారిపల్లి సమీపంలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కందుకూరు నుండి కనిగిరి కి వెళ్ళు రహదారిలో కనిగిరి వైపుకు మోటర్ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గేదె రోడ్డుపై అడ్డు వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ తో సహా వ్యక్తి రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడ్డ వ్యక్తి ఎవరనేది ఇంకా వివరాలు తెలియ రాలేదు.