కనిగిరి: పట్టణంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ముగిసిన వారాహి నవరాత్రి ఉత్సవాలు, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
కనిగిరి పట్టణంలోని దేవాంగనగర్ సమీపంలో కొలువైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో తొమ్మిది రోజులుగా నిర్వహిస్తున్న శ్రీ వారాహి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం ఘనంగా ముగిశాయి. ఉత్సవాల్లో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో చండీ హోమం కార్యక్రమాన్ని నిర్వహించగా పట్టణంలోని భక్తులే కాక, చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి హోమంలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, అమ్మవారి తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు