శ్రీశైలం: వైసీపీ నేత బుడ్డా శేషారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి.
త్రాగునీటి అవసరాలు, బావులు, బోర్ల రీఛార్జ్ కోసం విడుదల చేసిన నీటిని ఎమ్మెల్యే తన సొంత పొలానికి మళ్లించుకుంటున్నారంటూ వైసీపీ నేత బుడ్డా శేషారెడ్డి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర రెడ్డి స్పందించారు. తనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తూ స్వయంగా తన పొలం వద్దకు వెళ్లి వీడియోలు తీసి విడుదల చేశారు. తన పొలం పూర్తిగా ఎండిపోయి ఉందని.. పొలాన్ని స్వయంగా చూపిస్తూ వాస్తవ పరిస్థితిని ప్రజలకు, రైతులకు వివరించారు. గత తొమ్మిదేళ్లుగా తన పొలాన్ని గుత్తకు ఇచ్చానని, తాను స్వయంగా సాగు చేయడం లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.