పెద్దాపురం: సామర్లకోట-ప్రతిపాడు రహదారి పెద్దాపురంమండలం పులిమేరు-గోరింటా గ్రామాల మధ్యలో కల్వర్ట్ కూలి ట్రాఫిక్కుకు తీవ్రర అంతరాయం.
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం గోరింట-పులిమేరు గ్రామాల మధ్యలో సామర్లకోట నుండి ప్రతిపాడు వెళ్లే రోడ్డులో కల్వర్టు కూలిపోవడంతో . గురువారం ఉదయం నుండి ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగింది. స్కూల్, కాలేజీలకు విద్యార్థులు, వాహనాలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. భారీ వాహనాలు వల్ల కల్వర్టు కూలిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. వెంటనే కల్వర్టు మరమ్మత్తులు చేపట్టాలని అధికారులను గ్రామస్తులు కోరుతున్నారు.