మార్కాపురం: జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు
మార్కాపురం జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామి వారి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో వివిధ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఈ సందర్భంగా భజన కార్యక్రమాలు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.